తీరని వాయు కాలుష్యం: తొలిసారిగా చాలా పేలవంగా మారిన ఢిల్లీ గాలి
రిపోర్టర్: హరి
స్థలం: Delhi
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని, ఈ సీజన్ లోనే తొలిసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల ఇరవై నాలుగుకు పడిపోయిందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు. సోమవారం నాడు జహంగీర్ పురి, రోహిణి, పంజాబీ బాగ్ ప్రాంతాల్ లో కాలుష్యం తీవ్రమైన కేటగిరీకి చేరిందని అధికారులు తెలిపారు. నగరంలో రవాణా రంగం, పారిశ్రామిక ఉద్గారాల కారణంగానే పీఎం టూ పాయింట్ ఫైవ్ కాలుష్య కారకాలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.