పోన్కల్ రహదారిపై భారీ గుంతతో వాహనదారుల ప్రాణాలు అరచేతిలో
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో రహదారిపై గుంత ఏర్పడడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోన్కల్ నుండి బాదం పల్లికి వెళ్లే కెనాల్ వద్ద రోడ్డు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రాత్రివేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడం ప్రాణసంకటంగా మారిందని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.