ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో ఘనంగా ప్రత్యేక పూజలు
రిపోర్టర్: santhoshkumar
స్థలం: గాజువాక
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వడ్లపూడి శ్రీ సీతారామలింగేశ్వర ఆలయంలో కూటమి నాయకులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ దేశభక్తి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మోదీ ఆయురారోగ్యాల కోసం ఆకాంక్షించారు.