కాల్వపల్లిలో పంచాయతీ కార్యదర్శి భాను ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలోని కాల్వపల్లిలో బుధవారం సర్పంచ్ ఇంజ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి భాను ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగాయి. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది ప్రధాన వీధుల్లో మొలచిన పిచ్చి మొక్కలను తొలగించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.