ఏఐ రాశారనే ఆరోపణలతో గోంకూర్ ప్రైజ్ నుంచి నవల తొలగింపు
రిపోర్టర్: కిరణ్
స్థలం: పారిస్
ఫ్రెంచ్ రచయిత థెలిసన్ ఒరేలియన్ రాసిన 'ఇట్ వాజ్ ఐదర్ దట్ ఆర్ డై' నవల సాహిత్య ప్రపంచంలో సంచలనం సృష్టించింది. కేవలం కొద్ది వారాల్లోనే యాభై నాలుగు వేలకుపైగా కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించింది. అయితే ఈ పుస్తకం కృత్రిమ మేధ అనగా ఏఐ సహాయంతో రాశారన్న అనుమానాలతో ప్రముఖ గోంకూర్ ప్రైజ్ షార్ట్‌లిస్ట్ నుంచి తొలగించినట్లు సాహిత్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై రచయిత స్పందిస్తూ తానే స్వయంగా రాసినట్లు స్పష్టం చేశారు.