రామభద్రపురం మండలంలో చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు

రిపోర్టర్: విజయ్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా రామభద్రపురం మండలంలోని ఊరచెరువులో అభివృద్ధి పనుల పేరుతో అక్రమంగా మట్టి, కంకర తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను విస్మరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్రమార్కులు యంత్రాలతో భారీ గోతులు తవ్వుతుండటంతో చెరువుల ఆనవాళ్లు కోల్పోతున్నాయి. ఈ తవ్వకాల వల్ల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతుండగా పశువులు, పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.