మెగా డీఎస్సీ అక్రమాలపై సుప్రీంకోర్టు విచారణ జరిగే వరకు పోరాటం ఆగదు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
మెగా డీఎస్సీ 2025 నియామకాలపై సుప్రీంకోర్టు లేదా సీబీఐ విచారణ జరిగేంతవరకు తమ పోరాటం ఆగేది లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయవాడలో తమ పార్టీ నేతల మీద జరిగింది ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడేనని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడులకు తెగబడినా ఎలాంటి కేసులు నమోదు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు, నారా లోకేశ్‌ల బెదిరింపులకు భయపడేది లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.