హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవగాహన కార్యక్రమాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: భారతదేశం

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ్ నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 820 పాఠశాలల్లో చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు మూడు లక్షల మంది బాలికలకు అవగాహన కల్పిస్తూ అసాధారణ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.