అమెరికాలో విదేశీ ఉద్యోగులకు భారీ షాక్: వర్క్ పర్మిట్ పొడిగింపు రద్దు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Washington
అమెరికాలో విదేశీ ఉద్యోగులకు తీవ్ర ఎదురుదెబ్బ తగిలిందని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. వీసా పునరుద్ధరణ దరఖాస్తుల పెండింగ్ సమయంలో అమల్లో ఉన్న ఆటోమేటిక్ ఐదు వందల నలభై రోజుల వర్క్ పర్మిట్ పొడిగింపు నిబంధనను పూర్తిగా రద్దు చేసినట్లు వారు స్పష్టం చేశారు. ఈ తాజా నిర్ణయంతో హెచ్-వన్ బీ వీసాదారులు, వారి జీవిత భాగస్వాములు, ఆశ్రయం కోరుకునే అనేక మంది విదేశీ నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.