కారు నీళ్లు పడ్డాయని రిటైర్డ్ అధికారి హత్య

రిపోర్టర్: నరేష్ స్థలం: హర్యానా

హర్యానాలోని సోనిపట్ జిల్లా గన్నౌర్ ప్రాంతంలో కారు నుంచి నీళ్లు పడ్డాయన్న చిన్న వివాదం ఘర్షణకు దారితీసింది. వెళ్తున్న కారు నుంచి బురద నీళ్లు తనపై పడ్డాయని ఆగ్రహించిన ఓ యువకుడు, రిటైర్డ్ జిల్లా అటవీ శాఖాధికారి జైపాల్ రాథీపై రాయితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.