తెలుగులో త్రివిక్రమ్ సమర్పణలో 'హనుమాన్ అంశ్' విడుదల!

రిపోర్టర్: రాము స్థలం: Hyderabad

బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన 'హనుమాన్ అంశ్' సినిమాను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సమర్పణలో ఈ నెల 18న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి విశాల్ చతుర్వేది దర్శకత్వం వహించారు. బాలీవుడ్ లో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.