మలక్పేటలో దారుణం: మహిళపై కత్తితో దాడి చేసి సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లిన ముఠా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డి అన్నారం ప్రాంతంలో చోటుచేసుకున్న హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ వెల్లడించారు. కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. నిందితుల నుంచి ఇరవై మూడు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంటూ హైదరాబాద్ సిటీ పోలీస్ ట్వీట్ చేశారు.