భక్తిపారవశ్యంతో గణనాథుని దివ్య సన్నిధిలో మాజీ ఎంపీ దంపతులు
రిపోర్టర్: AMPAIAH ACHARI
స్థలం: ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మిలటరీ కాలనీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి మహోత్సవాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక మరియు బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రైతన్నలు సస్యశ్యామలమైన పంటలతో వర్ధిల్లాలని, ప్రతి ఇంట శాంతి సౌభాగ్యాలు నిండాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు.