జాతీయ రహదారి విస్తరణలో తీవ్ర జాప్యం.. పెరిగిన భూసేకరణ వ్యయం
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
పెందుర్తి-బొడ్డవర 516బి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. భూసేకరణ వ్యయం భారీగా పెరగడంతో ప్రాజెక్టు అంచనాలు తారుమారయ్యాయి. వ్యవసాయ భూములు మార్పిడి కారణంగా అదనంగా మరో రూ.300 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. అనుమతులు రాగానే చెల్లింపులు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.