ఆంధ్రప్రదేశ్ లో వేయి కోట్లతో నూతన ఈవీ తయారీ యూనిట్

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో విద్యుత్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటుకు దిల్లీకి చెందిన యూలర్ ఈవీ సంస్థ ముందుకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సుమారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో తిరుపతి లేదా రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ సంస్థ ప్రతిపాదించింది. దీని ద్వారా రాబోయే పదేళ్లలో ముప్పై ఐదు వేల మందికి పైగా యువతకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ యూనిట్ ద్వారా రెండు, మూడు, నాలుగు చక్రాల సరకు రవాణా వాహనాలను ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ తెలిపింది.