విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక యాప్: కేరళ సర్కార్ సంచలన నిర్ణయం
రిపోర్టర్: విజయ్
స్థలం: తిరువనంతపురం
రాష్ట్రంలో విద్యార్థుల భద్రతను మెరుగుపరచడంతో పాటు శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు రెండు కీలక కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ వెల్లడించారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం నిర్వహించనున్న కార్యక్రమంలో ఈ నూతన విధానాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. క్యాంపస్ లో వేధింపులను అరికట్టడంతో పాటు విద్యార్థులకు రక్షణ కల్పించే లక్ష్యంతో ఈ వినూత్న చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.