అమెరికాలో ఘనంగా తానా సమ్మర్ చెస్ టోర్నమెంట్

రిపోర్టర్: శివ స్థలం: USA

ఫిలడెల్ఫియాలో తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో సమ్మర్ చెస్ టోర్నమెంట్ నిర్వహించారు. వంద మందికి పైగా ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో సగానికిపైగా యుఎస్ చెస్ ఫెడరేషన్ రేటెడ్ ఆటగాళ్లు కావడం విశేషం. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారికి తానా నాయకులు అభినందనలు తెలిపారు. ఈ పోటీల విజయవంతానికి కృషి చేసిన నిర్వాహకులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.