స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం: సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

రిపోర్టర్: గోపి స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో సర్ ప్రక్రియ ముగియకుండానే ఎన్నికలకు సిద్ధమవుతున్నారంటూ వైఎస్సార్సీపీ సర్వోన్నత యాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో, తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు.