వైకాపా మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు అంబటి డుమ్మా

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

వైకాపా హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఈడీ విచారణకు మాజీ మంత్రి అంబటి రాంబాబు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణాల వల్ల తాను రాలేనని ఈడీ అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది. అంబటి ప్రధాన అనుచరులైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు ఇప్పించి భారీగా నిధులు కొల్లగొట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం వారిద్దర్నీ దాదాపు ఏడు గంటల పాటు విచారించి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం.