హక్కుల సాధన కోసం బరిలోకి దూకిన గిరిజన దళాలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం గిరిప్రసాద్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా రెండో కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర రామ్మూర్తి నాయక్ మాట్లాడుతూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సబ్ప్లాన్ నిధులు, రైతులకు సబ్సిడీలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో కమిటీలు ఏర్పాటు చేసి సమాఖ్యను బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మౌలానా, దండి సురేష్ తదితరులు పాల్గొన్నారు.