భారీ వర్షాలపై అధికారులను అప్రమత్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్

రిపోర్టర్: సురేష్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్తో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించారు. జిల్లాలో 117.6 మి.మీ. వర్షపాతం నమోదైందని, 1,885 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ వివరించారు. వర్షాలు తగ్గిన వెంటనే నష్టంపై నివేదిక సిద్ధం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పవన్ స్పష్టం చేశారు.