వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలకు అనుమతి లేదన్న సీఐ
రిపోర్టర్: ఇజం జర్నలిసిం ✍️✍️
స్థలం: నర్సంపేట
వినాయక నిమజ్జన వేడుకల్లో డీజేలు వినియోగించరాదని నర్సంపేట సీఐ ఎం.శ్రీనివాస్ సూచించారు. నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే సంబంధిత నిర్వాహకులపై కేసులు నమోదు చేయడంతో పాటు డీజేలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు.