అమెరికాలో ఘనంగా తానా ఆధ్వర్యంలో దేశీ డాన్స్ జుంబా
రిపోర్టర్: విజయ్
స్థలం: అమెరికా
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అప్పలాచియన్ రీజియన్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం కోసం నార్త్ కరోలినాలో ప్రత్యేకంగా దేశీ డాన్స్ వర్కవుట్ జుంబా కార్యక్రమం నిర్వహించారు. హంటర్స్‌విల్లే వెటరన్స్ పార్క్ లో జరిగిన ఈ వేడుకకు దాదాపు 250 మందికిపైగా మహిళలు ఉత్సాహంగా హాజరై శిక్షణ పొందారు. తానా నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిని అభినందించారు.