ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ పోరాటం: మల్లు భట్టి విక్రమార్క
రిపోర్టర్: సతీష్
స్థలం: ఖమ్మం
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఓటు హక్కును కాపాడే గొప్ప పోరాటానికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఓటు హక్కుపై అనుమానాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో దేశం మౌనంగా ఉండజాలదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వద్ద బాధ్యతను డిమాండ్ చేస్తూ సాగుతున్న ఈ పోరులో ఓటు, ప్రజాస్వామ్యం ప్రజలదేనని ఆయన స్పష్టం చేశారు.