క్రికెట్ దిగ్గజం సచిన్ వన్డే తొలి శతకానికి 32 ఏళ్లు పూర్తి

రిపోర్టర్: సతీష్ స్థలం: India

భారత క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 9 అత్యంత ప్రత్యేకమైన రోజు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1994లో ఇదే రోజున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి వన్డే శతకాన్ని సాధించారు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 110 పరుగులు చేసి అద్భుత విజయం అందించిన మాస్టర్ బ్లాస్టర్, ఆ తర్వాత వన్డేల్లో ఎన్నో రికార్డులకు బాటలు వేశారు.