ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం వేగవంతం చేసిన చర్యలు
రిపోర్టర్: శివ
స్థలం: ఆదిలాబాద్
ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు కోసం అదనంగా 1,500 ఎకరాల భూసేకరణ చేపట్టనున్నారు. డీపీఆర్, మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం త్వరలో నోడల్ ఆఫీసర్లను నియమించనున్నారు.