సౌరవ్ దాస్ జాతీయతపై విచారణ: మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: చెన్నై

కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ జాతీయతపై విచారణ జరపాలని కోరుతూ కాంచీపురానికి చెందిన వ్యాపారవేత్త ఆర్ గణేష్ కుమార్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఒకవేళ ఆయన భారతీయుడు కాదని తేలితే పాస్పోర్ట్, ఆధార్ కార్డు రద్దు చేయాలని పిటిషన్లో కోరినట్లు తెలిపారు. ఈ పిఐఎల్పై ప్రధాన న్యాయమూర్తి సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.