తిరుపతి జిల్లా చిన్నారి సంచలనం: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తిరుపతి

తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి దర్శన హరిశివశ్రీ అరుదైన ఘనత సాధించింది. యూకేజీ చదువుతున్న ఈ బాలమేధావి ఒకేసారి ఐదు విభాగాల్లో ప్రతిభ చాటుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్న వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ విభిన్న అంశాలపై పట్టు సాధించిన ఈ చిన్నారిని పలువురు అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్నిన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.