నిరుద్యోగులకు గుడ్ న్యూస్: పీజీఐఎంఈఆర్ నర్సింగ్ ఆఫీసర్ అడ్మిట్ కార్డులు విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: చండీగఢ్
పీజీఐఎంఈఆర్ నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్ మెంట్ పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసినట్లు పిజిఐఎంఈఆర్ అధికారులు వెల్లడించారు. ఛండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ఈ ప్రకటన చేసింది. ఈ రిక్రూట్ మెంట్ కింద మొత్తం 243 గ్రూప్-బి పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 18వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.