భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ జిల్లా విద్యాసంస్థలకు సెలవు
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ హరీంధర ప్రసాద్ బుధవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని డీఈవో కార్యాలయం స్పష్టం చేసింది. వర్షాల తీవ్రత దృష్ట్యా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.