రైతు అవమానంపై సీఎస్‌కు ఫిర్యాదు,MRO సస్పెన్షన్‌కు డిమాండ్: డా శివ ప్రసాద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్: గజ్వేల్‌లో రైతు పట్ల MRO వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. చినుకని శివ ప్రసాద్ ఫిర్యాదు చేశారు.
రైతుల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతులకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డా. శివ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.