నాణ్యత ప్రమాణాల పరిశీలన: బొబ్బిలి మండలంలో కొత్త రోడ్ల తనిఖీ

రిపోర్టర్: B RAJESH స్థలం: బొబ్బిలి

బొబ్బిలి మండలంలోని కాశీందొరావలస, ఎరకాందొరావలస గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రోడ్ కం డ్రైనేజీ పనులను డీఈ, ఏఈలు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు నిర్మాణ పనుల నాణ్యత, డ్రైనేజీ కాలువల నిర్మాణం, నీటి పారుదల సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా సక్రమంగా చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు.