ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి పేదల వైద్యానికి భరోసానివ్వాలి:డా శివప్రసాద్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నాంపల్లి
హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చినుకని శివ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండున్నరేళ్లలో రూ.2,408 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.727 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పెండింగ్ క్లెయిమ్‌లను పరిష్కరించి, ఆమోదించిన బిల్లులను నిర్ణీత గడువులోగా చెల్లించేలా టైమ్‌బౌండ్ విధానం అమలు చేయాలని ఆయన కోరారు.