ఆసియా క్రీడలలో స్వర్ణం సాధించిన క్రీడాకారిణులకు పురందేశ్వరి అభినందనలు
రిపోర్టర్: సునీల్
స్థలం: తూర్పు గోదావరి
ఆసియా క్రీడల మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించిన జ్యోతి సురేఖ వెన్నం, చికిత తానిపర్తి, పృతికా ప్రదీప్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ క్రీడాకారిణులు రెండు వందల ముప్పై ఎనిమిది బై రెండు వందల నలభై స్కోరుతో ప్రపంచ రికార్డును సమం చేశారని ఆమె పేర్కొన్నారు. ఖచ్చితత్వం, ఆత్మవిశ్వాసంతో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశం గర్వించేలా చేశారని పురందేశ్వరి కొనియాడారు.