జీకే వీధి సీలేరు రహదారిపై విరిగిపడిన కొండచరియలు రాకపోకల నిలిపివేత
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: జి.కె.వీధి
జీకే వీధి నుండి సీలేరు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు, చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై మట్టి, బండరాళ్లు పేరుకుపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ఈ మార్గంలో ప్రయాణించవద్దని స్థానికులు సూచిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి, రహదారిని పునరుద్ధరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.