పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ సోదరి అలిమా ఖాన్ అరెస్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: World

పాకిస్తాన్ లోని లాహోర్ లో సెప్టెంబర్ 27న చేపట్టతలపెట్టిన నిరసన మార్చ్ కు ముందు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలిమా ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా భద్రతకు ముప్పు ఉందనే కారణంతో ఆమెను 30 రోజుల పాటు జైలుకు తరలించినట్లు లాహోర్ జిల్లా యంత్రాంగం వెల్లడించింది. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసమే ఈ నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పీటీఐ పార్టీ నేతలు తెలిపారు.