పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలి: మాచర్ల శివశంకర్ డిమాండ్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ప్రపంచ పత్తి దినోత్సవ సదస్సులో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని మాచర్ల శివశంకర్ డిమాండ్ చేశారు. పత్తి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ఈ డిమాండ్ నెరవేరకపోతే భవిష్యత్తులో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కేంద్రానికి సిఫారసు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.