బంగాల్‌లో దుర్గాపూజ కమిటీలకు రూ.లక్ష ఆర్థిక సాయం

రిపోర్టర్: అశోక్ స్థలం: పశ్చిమ బెంగాల్

పశ్చిమ బంగాల్‌లో దుర్గాపూజ వేడుకల కోసం సీఎం సువేందు అధికారి పూజా కమిటీలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పూజా కమిటీలకు విద్యుత్ ఛార్జీలు 100 శాతం మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే అష్టమి రోజు రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని, డీజేల వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.