జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్ర నెట్‌వర్క్ భగ్నం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓవర్ గ్రౌండ్ వర్కర్ నెట్‌వర్క్‌ను పోలీసులు భగ్నం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి శక్తివంతమైన ఐఈడీని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు లాజిస్టిక్ సపోర్ట్, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్న ఈ ముఠా కదలికలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి.