విజయవాడ ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ సంచలన ఛార్జ్ షీట్

రిపోర్టర్: శివ స్థలం: విజయవాడ

విజయవాడ ఉగ్రమూలాల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో తొమ్మిది మంది నిందితులపై అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఐసిస్ జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేస్తూ దేశంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ కేసులో మహ్మద్ రెహ్మతుల్లా షరీఫ్ సహా పలువురిపై కీలక ఆధారాలు సేకరించినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.