గుర్గావ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితులకు రిమాండ్
రిపోర్టర్: అశోక్
స్థలం: హర్యానా
గుర్గావ్ గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై మహిళా బైకర్ శివానీ చౌహాన్ అలియాస్ సియాను కారుతో వెంబడించి ఢీకొట్టిన ప్రధాన నిందితుడు కళ్యాణ్ సింగ్ బైన్స్లా మరియు అతని బంధువు లవ్నీశ్ లను కోర్టు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. శనివారం రాత్రి క్లబ్ నుండి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, నిందితులకు మద్దతుగా మహాపంచాయత్ నిర్వహించడంపై బాధితురాలు తీవ్రంగా స్పందిస్తూ ఇది కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నమని మండిపడ్డారు.