కళాశాల వెలుపల జరిగిన ఘర్షణలో విద్యార్థి హత్య

రిపోర్టర్: కృష్ణ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని నాగరబావి ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ కళాశాల వెలుపల రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో పందొమ్మిదేళ్ల యోగేష్ అనే ప్రథమ సంవత్సర బీకాం విద్యార్థి కత్తిపోట్లతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. తరగతి గదిలో ఉండగా స్నేహితుడు బయటకు పిలవడంతో వెళ్లిన యోగేష్పై కొందరు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై నలుగురైదుగురి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.