ఖమ్మం నవదుర్గా వేడుకల్లో భక్తిశ్రద్ధలతో పోటెత్తిన భక్తజనం

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం పాకబండ బజార్లోని బేడ బుడగ జంగాల కాలనీలో శ్రీ నవదుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఉత్సవ కమిటీ నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, స్థానిక భక్తులు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.