'ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికే ఇస్తా': సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ ఆస్తులపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఎన్నికల అఫిడవిట్లో చూపిన దానికంటే ఒక్క గజం భూమి అదనంగా ఉన్నట్లు నిరూపించినా ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని సవాల్ విసిరారు. సీఎం ప్రస్తావించిన ఆస్తులపై పూర్తి నిజాలు నిగ్గు తేలాలంటే ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.