ఎనిమిది హామీల మేనిఫెస్టోతో విజయనగరం బాబామెట్ట ఎన్నికల బరిలోకి చంద్రశేఖర వర్మ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ఇరవై రెండవ డివిజన్ బాబామెట్ట స్వతంత్ర అభ్యర్థిగా చంద్రశేఖర వర్మ బరిలో నిలిచారు. ఎనిమిది అంశాల ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. ఓటర్లు అందరూ తమ అమూల్యమైన ఓటును నాల్గవ నెంబర్ బ్యాట్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన వీడియోలో విజ్ఞప్తి చేశారు.