ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సెర్ప్ సీఈవో కరుణ వెల్లడించారు. ఈ నెల ముప్పైవ తేదీన అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. ఒకవేళ ఆ రోజు తీసుకోలేని వారికి నవంబర్ నాలుగు, ఐదు తేదీల్లో మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.