వినియోగదారులకు షాక్: రత్నదీప్, అక్షయకల్ప సంస్థలకు భారీ జరిమానా విధింపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
వినియోగదారుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రముఖ సంస్థలకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-2 గట్టి షాక్ ఇచ్చిందని అధికారులు వెల్లడించారు. బూజు పట్టిన వెన్నను విక్రయించినందుకు గాను రత్నదీప్ మరియు అక్షయకల్ప ఫార్మ్స్ సంస్థలకు భారీ జరిమానా విధిస్తూ కమిషన్ అధ్యక్షుడు వళ్ళంట్ల నరసింహారావు తీర్పు వెలువరించారు. సైనిక్‌పురిలోని స్టోర్‌లో కొనుగోలు చేసిన వెన్న పాడైపోవడంతో బాధితురాలు సంధ్య చేసిన ఫిర్యాదు మేరకు ఈ కీలక తీర్పు వెలువడింది.