మహా దీపారాధనతో ఆధ్యాత్మిక శోభ
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు మహిళల ఆధ్వర్యంలో స్వామివారికి మహా దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గణపతి నామస్మరణ, భక్తి గీతాలతో పరిసరాలు మార్మోగాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో శివాజీ యువజన సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.