జి.వి. ప్రకాష్ కుమార్ 'ఇమ్మోర్టెల్' తెలుగు ట్రైలర్ విడుదల
రిపోర్టర్: మహేష్
స్థలం: ఇండియా
టాలీవుడ్, కోలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'ఇమ్మోర్టెల్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. మారీయప్పన్ చిన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది. కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు. రహస్యమైన మలుపులతో సాగే ఈ ఉత్కంఠభరిత ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.