ఆత్మకూరు(ఎం)రెడ్డి సంఘం సమావేశం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని ఎంఎస్ఆర్ గార్డెన్లో రెడ్డి సంక్షేమ సంఘం మండల సమావేశం బొబ్బల ఇంద్రారెడ్డి అధ్యక్షతన మంగళవారం రోజు సమావేశం జరిగినది.ఈ సమావేశములో అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఖాళీలు 7437 రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ 26 రోజున కానిస్టేబుల్ పరీక్షలు నవంబర్ 29న ఎస్సై పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రభుత్వం కటాఫ్ మార్కులను కూడా ప్రకటించింది ఎస్సీ ఎస్టీలకు 40 మార్కులు బీసీలకు 50 మార్కులు ఓసీలకు 60 మార్కులను ప్రకటించిన ప్రభుత్వం ఈ డబ్ల్యూ ఎస్ వర్గాలకు కూడా 60 మార్కులు కేటాయించడం అన్యాయమని ఈడబ్ల్యుఎస్ వర్గాలకు కూడా బీసీలతో సమానంగా 50 మార్కులు కటాఫ్ గా పెట్టాలని రెడ్డి సంఘం మండల శాఖ డిమాండ్ చేస్తుంది.పోలీస్ నియామకాల ఫ్రీలిమీనరి పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సంబంధించిన కటాఫ్ మార్కులను తగ్గించి నియామక ప్రక్రియలో న్యాయం జరిగేటట్లు చూడాలని రెడ్డి సంఘం డిమాండ్ చేస్తుంది అని అన్నారు.